calender_icon.png 25 April, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎం గెలుపు

25-04-2025 09:35:07 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎం విజయం అందుకుంది. మొత్తం 112 ఓటర్లలో 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు వచ్చాయి. దీంతో 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే బీజేపీ రాగా.. ఇక ఎంఐఎంకి చెందిన 49 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి చెందన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ కు వచ్చాయి. 

సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం 2025 మే 1న ముగియనున్నందున, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికకు మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు నామినేషన్ దశ ప్రారంభం కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు కొనసాగింది. ఏప్రిల్ 7న నామినేషన్లను పరిశీలన, ఏప్రిల్ 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ప్రక్రియ జరిగింది ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించి, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించారు.  ఈ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అపీషియా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దూరంగా ఉన్నాది.