హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రైతులను రుణవిముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఒకే దఫాలో పంటరుణాలను మాఫీ చేసేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసిచూస్తామని మంత్రి స్పష్టం చేశారు. టీజీఎస్డీసీల్ చైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పంట రుణాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఆయకట్టును పెంచేందుకు కనీస పెట్టుబడితో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల న్నింటీనీ పూర్తిచేయాలని నిర్ణయించిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.