calender_icon.png 27 December, 2024 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

28-10-2024 01:48:03 AM

  1. ఐదేళ్ల్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం 
  2. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు 
  3. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.400 కోట్లు చెల్లింపు 
  4. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మం, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన లేడీస్ లాంజ్, ఉద్యోగుల భోజనశాల, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, బస్ స్టాప్ షెల్టర్‌ను ప్రారంభించి మాట్లాడారు. మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

మహిళా సంఘాలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సర్కార్ ప్రతినెలా ఆర్టీసీకి రూ.400 కోట్లు చెల్లిస్తున్నదన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మహిళలతో పభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20 వేల కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు మహిళలకు ఇస్తామన్నారు. బోయే అయిదేళ్లలో లక్ష కోట్లు అందిస్తామన్నారు. పతి శాసనసభా నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు ప్రత్యేకంగా చిన్న తరహా పశ్రమలు ఏర్పాటుకు ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే పరికరాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాలను మరింతగా భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. మహిళా శక్తి  క్యాంటీన్ ద్వారా14 మందికి  ఉపాధి లభిస్తుందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి బోనకల్లు మండలం తూటికుంట్లలో రూ.3.95 కోట్లతో తూటికుంట్ల  గోవిందాపురం.

ఎల్ గ్రామానికి, బ్రాహ్మణపల్లి నుంచి రాపల్లి వరకు  రూ.2.45 కోట్లు, కలకోటలో రూ. 1.50 కోట్లతో  బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.