calender_icon.png 19 January, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడో విజయంపై గురి

18-09-2024 12:40:35 AM

45వ చెస్ ఒలింపియాడ్

బుడాపెస్ట్: హంగేరి వేదికగా జరుగుతున్న 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత్ ఏడో విజయంపై గురి పెట్టింది. టోర్నీలో  వరుసగా ఆరు విజయాలతో సత్తా చాటిన భారత పురుషుల బృందం ఏడో రౌండ్‌లో చైనాతో.. అటు మహిళల బృందం జార్జియాతో నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చైనా గ్రాం డ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఈ ఏడాది నవంబర్‌లో ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఆడనున్న నేపథ్యంలో వీరి పోటీపై ఆసక్తి నెలకొంది. గుకేశ్ ఐదు గేముల్లో 4.5 పాయింట్లు సాధించగా.. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఆరు గేముల్లోనూ విజయాలు సాధించి ఆరు పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. మహిళల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.