- నేడు సౌతాఫ్రికా, భారత్ చివరి టీ20
- సమం చేయాలని సఫారీల ఆరాటం
- రింకూ ఫామ్‌పై ఆందోళన
జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడానికి టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరగనున్న వాండరర్స్ స్టేడియంతో భారత్‌కు మంచి అనుబంధముంది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఇక్కడే జరగ్గా .. ఆ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
గతేడాది సౌతాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్ 1 డ్రాగా ముగిసింది. చివరగా 2017 సఫారీ పర్యటనలో టీమిండియా 2 సిరీస్‌ను గెలుచుకోవడం విశేషం. ప్రస్తుత సిరీస్‌లో 2 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన నాలుగో టీ20లో విజయం సాధించి 3 సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. అటు సౌతాఫ్రికా మాత్రం నాలుగో టీ20లో విజయంతో టీ20 సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది.
రింకూ రాణించేనా?
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు మిడిలార్డర్‌లో తిలక్ వర్మ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. అయితే ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన రింకూ సింగ్ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 28 పరుగులు మాత్రమే చేసిన రింకూ బంతుల పరంగా (34) తీసుకోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ వైఫల్యం కూడా జట్టును కలవరపెడుతోంది.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో తిలక్ మూడో స్థానంలో వచ్చి సెంచరీ బాదడంతో నాలుగో స్థానంలో సూర్య వస్తాడా లేక రింకూకు చాన్స్ ఇస్తాడా అన్నది చూడాలి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పర్వాలేద నిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో ఒక పేసర్ అవసరమనుకుంటే యశ్ దయాల్ లేదా విజయ్‌కుమార్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది.
ఇక సౌతాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్ పటిష్టం గా కనిపిస్తోంది. ముఖ్యంగా క్లాసెన్, మిల్లర్, మార్కో జాన్సెన్‌లు దనాధన్ ఇన్నింగ్స్‌లతో భయపెడుతున్నా రు. వీరిని కట్టడి చేస్తే టీ మిండియా విజయం నల్లే రు మీద నడకే కానుంది.