- నేడు భారత్, బంగ్లా మూడో టీ20
- ఉప్పల్ వేదికగా రాత్రి 7 నుంచి
విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌కు నగరంలోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యా యి. నేడు జరగనున్న చివరి టీ20లోనూ గెలిచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఉప్పల్‌లో ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియానే విజయం వరించింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై భారత్ విజయాలు సాధించింది.
టీమిండియాలో మార్పులు!
సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న భారత్ జట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది మూడో టీ20లో సంజూ స్థానంలో జితేశ్ శర్మకు చోటు దక్కే అవకాశముంది. అభిషేక్ కూడా విఫలమైనప్పటికీ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడే అతడికి ఇది సొంత మైదానం కావడంతో మరో చాన్స్ ఇచ్చే యోచనలో ఉంది. మిడిలార్డర్‌లో నితీశ్ కుమార్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతుండడం సానుకూలాంశం.
వీరికి తోడు చివర్లో రియాన్ పరాగ్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. ఇక అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మరోసారి కీలకమయ్యే అవకాశముంది. చివరి మ్యాచ్‌లో గెలిచి పరు వు కాపాడుకోవాలని భావిస్తోన్న బంగ్లా జట్టు ఎలాంటి మా ర్పులు చేయకపోవచ్చు.