calender_icon.png 27 December, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లీన్‌స్వీప్‌పై గురి

27-12-2024 01:20:02 AM

నేడు భారత్, విండీస్ మూడో వన్డే

వడోదర: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. నేడు ఇరుజట్ల మధ్య వడోదర వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. రెండో వన్డేలో భారీ విజయం దక్కించుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది.

ఓపెనర్లు మంధాన, ప్రతికా రావల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్ మరోసారి  కీలకం కానున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో రేణుకా సింగ్, ప్రియా మిశ్రా కీలకం కానున్నారు.