నేను పయనం మొదలు పెడతాను
నా ప్రియురాలి కోరికపై
పారిజాతం ఎక్కడున్నదనీ
సౌగంధిక పరిమళం ఎక్కడ నుంచనీ
అల్లంతా దూరన నందన వనం
చుట్టు ఎందరెందరో సైన్యం
ఎత్తయిన దుర్గాలు బలమైన సర్పాలు
వాడియైన కొమ్ములతో కరాలు
ఎంతటి వారినైన నేల కూల్చే ఆయుధాలు
అయినా నే సాధిస్తాను పారిజాతం
నా ప్రియురాలి తలలో తుమురడానికీ
కోండలు కోనలు, రాళ్లు రప్పలు
ఎన్నెనో కంటకాలు ఒళ్ళంతా గాయాలు
పదునైన తృణాలు, ఆకతాయి కోతులు
పరీక్షించే కాలం లొంగిపోయే బుద్ధిబలం
ఎంత దూరమో, ఎంత సాహసమో
అయినా నేను సాధిస్తాను సౌగంధికం
నా ప్రియురాలి తలలో తుమురడానికీ
నా ప్రియురాలిని పుష్పసౌరభంతో
ముంచేసే నిరీక్షణకు స్వస్తి చెప్పి
తిరుగు ప్రయాణం చేస్తాను
లక్ష్యం కోరికలు రెండు భిన్న ధృవాలు
కాలం కరిగినంత గతులు మారును
పరిమళాలతో పారిజాతాలు
సుగంధాలతో సౌగంధికాలు
కానీ.........ఎవరున్నారు నాకు
పుష్ప సమర్పణకు నా ప్రియురాలు......
ఇప్పుడు బహుదూరం.
8801444335
- ఐ.చిదానందం