calender_icon.png 22 November, 2024 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ అదుపులో ఐలాపూర్ కార్యదర్శి

22-11-2024 01:30:19 AM

  1. ఇంటినంబర్ కోసం రూ.25వేల డిమాండ్

అమీన్‌పూర్, నవంబర్ 21: అమీన్‌పూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మెదక్ రేంజి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. మం డలం లోని ఐలాపూర్ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేసిన సచిన్ ఓ ఇంటి నంబర్ కోసం మల్లేశ్ అనే వ్యక్తి వద్ద లంచం తీసుకున్నట్లు ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఐలాపూర్ గ్రామ పంచాయితీని ప్రభుత్వం ఇటీవల అమీన్‌పూర్ మున్సిపల్‌లో విలీనం చేసింది. అయితే గతంలో ఇంటి నంబరు కోసం మల్లేశం పంచాయతీ కార్యదర్శి సచిన్‌ను కలిశారు. ఇంటి నంబర్ కోసం రూ.25వేల ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కార్యదర్శికి తొలుత రూ.10వేలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ క్రమం లో మరోసారి రూ.15వేలు లంచం ఇస్తుండగా ఫిర్యాదు దారుడు మల్లేశ్ వీడియో తీసి.. దానిని ఏసీబీ అధికారులకు అందించాడు. మల్లేశ్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పంచాయతీ కార్యదర్శి సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సచిన్ పం చాయతీ కార్యదర్శిగా ఉన్న ఐలాపూర్‌లో ఇచ్చిన ఇంటి నంబర్ల జాబితను అధికారులు సేకరించిని విచారణ చేపడుతున్నారు. కాగా ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి సచిన్ సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.