calender_icon.png 25 October, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా వర్సిటీకి ఐలమ్మ పేరుపై హర్షం

12-09-2024 12:09:08 AM

సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీల అభినందన లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజ యక్రాంతి): కోటి మహిళా విశ్వవి ద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తెలం గాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశా రు. సామాజిక న్యాయాన్ని అణు వణువునా పాటించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పెద్ద యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం స్వాగతించాల్సిన విషయమ ని వారు అన్నారు.  ఉద్యమకారిణి, అణచివేతను ఎదిరించిన మహిళ, చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐల మ్మ పేరును ఒక గొప్ప విద్య సంస్థకు పెట్టడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలాంటి మంచి నిర్ణ యాలు జరుగుతాయని,  ఇది అంద రూ స్వాగతించాల్సిన విషయమని వారు అన్నారు. ఈ అంశాలపై వారు ఒక లేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.