calender_icon.png 17 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా వర్సిటీకి ఐలమ్మ పేరు

11-09-2024 03:32:00 AM

ఆమె స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ భూసంస్కరణలు  

ధరణి ముసుగులో భూములు గుంజుకునే కుట్రలు

ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్ సభ్యురాలి పదవి  

చాకలి ఐలమ్మ వర్ధంతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐల మ్మ పేరును పెడతామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియ మిస్తున్నట్టు ప్రకటించారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగ స్వాములుగా ఉండాలని, తమకు ప్రశ్నించే గొంతుకలే కావాలని, అందు కే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుందని స్పష్టంచేశారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రవీంద్రభారతి లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొ రేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగా ణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తు న్నామని చెప్పారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలు పేదలకు చేరా లని నాడు ఐలమ్మ పోరాటం చేశారని గుర్తుచేశారు.  ఐలమ్మ స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు నాడు భూ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. లక్షలాది మంది పేదలకు భూమి హక్కులను కల్పించారని చెప్పారు.

కానీ, ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారని ఆరోపించారు. భూముల ఆక్ర మణలు అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మనే తమకు స్ఫూర్తి అని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా చాకలి ఐల మ్మ కుటుంబాన్ని సీఎం సన్మానించారు. నృత్యకారిణి అలేఖ్య పుంజాల బృందం చేసిన ప్రదర్శన ఆకట్టుకుం ది. ఈ కార్యక్రమంలో పలువురు ప్ర జాప్రతినిధులు, మహిళా కమిషన్ చై ర్‌పర్సన్ నేరెళ్ల శారద, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.