calender_icon.png 18 January, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఉద్యమాలకు ఐలమ్మ స్ఫూర్తిదాయకం

11-09-2024 12:45:47 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరా టం ఎన్నో ప్రజా ఉద్యమాలకు స్ఫూ ర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ.. తెలంగాణ సా యుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ పోరాటానికి ప్రపంచ చరిత్ర పుట ల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాడ్డాక మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారని గుర్తుచేశారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని, ఆమె వర్ధంతిని అధికారికంగా నిర్వహించినట్టు స్పష్టంచేశారు.