హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22(విజయక్రాంతి): ఇటీవల పదోన్నతి పొంది హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టబోతున్న ప్రస్తుత రిజిస్ట్రార్(జుడీషియల్) తిరుమలదేవిని ఆలిండియా జుడీషియల్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్(ఏఐజేఈసీ) నాయకులు బుధ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఏఐజేఈసీ అఖిల భారత అధ్యక్షుడు బోదా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రమణారావు ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు.. తిరుమలదేవిని ఘనంగా సన్మానించారు. కార్యాక్రమంలో సంఘం నాయకులు రాకేశ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.