calender_icon.png 30 November, 2024 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ వ్యాప్తంగా భయంకర వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి

30-11-2024 05:21:31 PM

ఎయిడ్స్ పై అవగాహన అవసరం 

ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహణ 

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా భయంకర వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి అని విశ్రాంత డిప్యూటీ పారా మెడికల్ అధికారి జి.గురుప్రకాష్ పేర్కొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం చందానగర్ లోని లేపాక్షి జూనియర్ కాలేజీలో విద్యార్ధిని, విద్యార్దులకు ఎయిడ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధి భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీని నష్టనివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 1వరల్డ్ వైడ్ ఎయిడ్స్ వ్యాధితో కలిగే నష్టాలు,దాని నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన కొరకు ప్రతి ఏటా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదని,ఇది రోగ నిరోధక శక్తిపై దాడి చేసే వైరస్ మాత్రమేనని అన్నారు. హెచ్ఐవి సోకినట్లు రక్త పరీక్షల ద్వారానే తెలుస్తుందన్నారు. దీన్ని ఎంత త్వరగా గుర్తిసే అంతా త్వరగా చికిత్స చేస్తే మంచిదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్, అమ్మయ్యచౌదరి, తదితరులు పాల్గొన్నారు.