18-02-2025 01:30:05 AM
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 17 ( విజయ క్రాంతి ): భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ హర్యానా మాజీ మంత్రి అజయ్ సింగ్ యాదవ్ దంపతులు వచ్చారు.
ఎమ్మెల్యే దంపతులు వారికి సాదరంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. దేశ రాష్ట్ర రాజకీయాలపై, కుల గణనపై చర్చించారు. వారి వెంట తెలంగాణ రాష్ట్ర ఓబీసి చైర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.