calender_icon.png 22 March, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడు కొండేటి వెంకట రెడ్డికి సంతాపం

21-03-2025 10:01:20 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రైతు కొండేటి వెంకట్ రెడ్డి శుక్రవారం తన వ్యవసాయ వరి పొలానికి పురుగుల మందు పిచికారీ చేస్తుండగా ఒక్కసారిగా గుండె పోటు రావడంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు  ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విచ్చేసి మృతుడు వెంకటరెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పింఛి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.