calender_icon.png 14 April, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక మీటింగ్

08-04-2025 01:10:08 AM

  1. నేడు, రేపు నిర్వహణ
  2. రాష్ట్రం నుంచి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 44 మందికి ఆహ్వానం 
  3. నేడు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళ, బుధవారాల్లో జరిగే ఏఐసీసీ కీలక సమావేశానికి రాష్ట్రం నుంచి 44 మంది కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మిగతా మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేత లు హాజరుకానున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం అహ్మదాబాద్‌కు వెళ్లనుండగా, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం సాయంత్రమే అహ్మదాబాద్‌కు వెళ్లారు. రెండు రోజు ల పాటు జరిగే సమావేశాల్లో కీలకమైన అం శాలపై చర్చించనున్నారు.

మొదటి రోజు సీడబ్ల్యూసీ, రెండో రోజు ఏఐసీసీ మీటింగ్ నిర్వహించనున్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ఎదురవుతున్న సవా ళ్లు, రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి, భవిష్యత్ కార్యాచరణపై ఏఐసీసీ సదస్సులో చర్చించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.