calender_icon.png 28 November, 2024 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్‌లో ఏఐది కీలక పాత్ర

27-10-2024 01:07:12 AM

తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): భవిష్యత్‌లో మానవ నైపుణ్యాభివృద్ధిలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్) కీలక పాత్ర పోషించనుందని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాల కుడు మామిడి హరికృష్ణ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్‌పై అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ అంటే ఏమిటి?  భవిష్యత్‌లో ఎలా ఉపయోగపడుతుందనే అంశాల తో పాటు క్రియేషన్ అందరికీ అందుబాటులో ఎలా ఉంచాలి అనేదానిపై  28, 29వ తేదీలలో రవీంద్రభారతిలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఈ వర్క్‌షాప్‌లో సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, పర్యాటకం, కళారూపాలు వంటి వాటిని ఏఐతో ఎలా చిత్రీకరించాలనేది ఔత్సాహికులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.