- మూడేళ్లలో 25 శాతం మందికి అందుబాటులోకి
- విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అమలుపై దృష్టి
- పరిపాలనలో వ్యూహాత్మకంగా ఏఐ సేవల వినియోగం
- దేశానికే దిక్సూచిగా నిలిచేందుకు ప్రణాళికలు
- సింగపూర్ వ్యూహాన్ని అనుసరించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): యువతలో నైపుణ్యాలను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతోపాటు అపారమైన ఉపాధి కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. దానికనుగుణంగా ఇప్పటికే ఏఐ సిటీని ప్రారంభించింది. దీని ద్వారా ఏఐలో నైపు ణ్యం పొంది ఎంతో మంది యువత ఉపాధి పొందనున్నారు. అయితే శిక్షణ, ఉపాధిలో లాగానే పరిపాలనలో కూడా ఏఐని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ఇందులో భాగంగా అన్ని శాఖల్లోని ప్రధానమైన కార్యకలాపాలను ఏఐ టెక్నాలజీ ద్వారా నిర్వహించాలని చూస్తోంది. ఏఐ సహకారంతో పాలసీల రూపకల్పన చేయడంతోపాటు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి సమగ్రమైన పరిష్కార మా ర్గాలను అన్వేషిస్తున్నది. రాబోయే మూడేళ్ల లో కోటి మందికిపైగా సేవలను అందించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల ఉత్పాద కతను 20 శాతానికి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పరిపాలనా పరమైన అంశాల్లో నూ ఏఐని సమర్థవంతంగా వినియోగించుకుని దేశానికే దిక్సూచిగా నిలిచేం దుకు ప్రణాళికలు రచిస్తున్నది.
సవాళ్లను పరిష్కరించడానికి..
రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సుస్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ఏఐ సేవల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ గవర్నెన్స్, సవాళ్లను ఎదుర్కోవడంలో ఏఐ పాత్రపై కీలకంగా వ్యవహరించనున్నది. రాష్ట్ర జనాభాలో అధికశాతం ఇప్పటికీ విద్య, వైద్య, వ్యవసాయ, అర్బన్ మొబిలిటీ తదిత ర రంగాల్లో ప్రభుత్వ సేవలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో సామర్థ్యం, ప్రతిస్పందనలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డేటా ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా ఆయా రంగాల్లోని సవాళ్లను సులువుగా పరిష్కరించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన జీవన శైలిని అందించేందుకు అవకాశం లభిస్తుంది. అయితే 2027 కల్లా రాష్ట్రంలోని 25 శాతం మందికి ఏఐ ఆధారిత సేవలను అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుంది. ఆ దిశగా చర్యలకు అడుగులు వేస్తున్నది.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో..
ఐటీఈ అండ్ సీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ద్వారా అన్ని శాఖల్లో ఏఐ ఆధారిత సేవలపై కలిసి పనిచేయనున్నది. అధిక సంఖ్యలో ప్రజల సమ స్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమి కంగా వ్యవసాయ, విద్య, ప్రజారోగ్య రంగా ల్లో ఈ ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొదట ఈ రంగాల్లో నెలకొన్న సవాళ్లును సమర్థవంతంగా పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి సారించారు. పరిపాలనలో ఏఐ ఆధారిత సేవల వినియోగిం చుకోవడంలో సింగపూర్ వ్యూహాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది. హెల్త్‌కేర్, అర్బన్ లివింగ్, సప్లు చైన్ వంటి అంశాల్లో సింగపూర్ అవలంభించిన పద్ధతులపై ప్రధానంగా దృష్టి సారించింది.
ఆయా రంగాల్లో ‘ఏఐ’..
రాష్ట్రంలోని ఆయా రంగాల వారీగా ఏఐ సేవలందించేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించుకుంది. ఇందులో భాగంగా 80 లక్షల మందికి సంక్షేమ పథకాల అందించడంలో ఏఐ సేవలను వాడుకోనున్నది. అర్బన్ మొబిలిటీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సవాళ్లను ఎదుర్కోవడంలో ఏఐ ద్వారా 40 లక్షల మం దికి సేవలు అందనున్నాయి. వ్యవసా య రంగానికి సంబంధించి 30 లక్షల మందికి ఏఐ ఆధారిత సేవలను అందించనున్నారు.
ఏఐ ద్వారా అధిక ప్రమాద తీవ్రతను తెలుసుకోవడం, చికిత్స, మెడికల్ కేర్ వంటి అంశాల్లో 70 లక్షల మందికి సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. టెలీ మెడిసిన్ రంగంలో 21 లక్ష ల మందికి ప్రాథమిక ఆర్యోగ సూచనలు ఇవ్వడంలో ఏఐ సేవలు వినియో గించుకోనున్నది. విద్యార్థుల్లో పాఠశాల దశ నుంచే ఏఐ శిక్షణ ఇవ్వడంలో భా గంగా 30 లక్షల మందికి ఏఐ ఆధారిత సేవలను ప్రభుత్వం అందించనున్నది.