calender_icon.png 16 March, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో ఏ.ఐ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం

15-03-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

ఆదిలాబాద్, మార్చ్ 14 (విజయ క్రాంతి) : అదిలాబాద్ లోని తాటిగూడ కాలనీ, తలమడుగు మండలం దేవాపూర్, ఖోడద్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ.ఐ) ద్వారా బోధన ను ఈనెల15వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ విద్యాశాఖ మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో (FLN) లో కృత్రిమ మేథను ఉపయోగించి బోధన ను మెరుగుపరచడానికి axl , Ekstep ఫౌండేషన్ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు గా  జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించడం జరిగిందనీ, మొదటగా ఈనెల 15  రేపు శనివారం 4 ప్రైమరీ పాఠశాలలో ప్రారంభించేందుకు ఆన్ని ఏర్పాట్లు చేయాలని శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ పలు సూచనలు సలహాలు చేశారు.

ఈ సందర్భంగా ఒక క్వాలిటీ కంట్రోలర్, ఒక మండల విద్యాశాఖాధికారి, ఒక పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడు జిల్లా నుండి నలుగురికి ఇది వరకే రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్నారని తెలిపారు. విద్యార్ధులు ప్రాథమిక స్థాయిలో భాషలో అభ్యసన సామర్ధ్యాలు, అలాగే గణితంలో చతుర్విధ ప్రక్రియల్లో వెనకబాటు లోనే ఉంటున్నారని, ఈ క్రమంలో కృత్రిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

ఆయా ప్రైమరీ పాఠశాలలో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని ఆన్నారు. ప్రతీ పాఠశాలలో 5 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని విండోస్ 10 తప్పనిసరిగా ఇన్ స్టాల్  చేసుకోవాలనీ, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని ఆన్నారు. హెడ్ సెట్స్ పాఠశాలల్లో అందుబాటులో లేక పోవడంతో జిల్లా కలెక్టర్ హెడ్ సెట్స్ ను అందించారు. గూగుల్ మీట్ లో విద్యాధికారి ప్రణీత, ఎంఈఓ లు మనోహర్, వెంకట్ రావ్, క్వాలిటీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, లీడీఎం, తదితరులు తదితరులు ఉన్నారు.