ప్రస్తుతం టెక్నాలజీ...అందరినీ శాసిస్తోంది. టెక్నాలజీ లేనిదే ప్రపంచం లేదు. ఏ పని చేయాలన్నా టెక్నాలజీ ఉండాల్సిందే. దానికి తోడు ఇప్పుడు ఏఐ తోడయ్యింది. అన్నీ పనులను ఈజీగా చేస్తోంది. తాజాగా కొన్ని టెక్నాలజీ సంస్థలు ఏఐ అమ్మను పరిచయం చేశాయి. ఆమె పేరు కావ్య మెహ్రా. ఇన్‌ప్లుయెన్సర్ కూడా. మనదేశంలో అతిపెద్ద సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ ద్వారా కావ్య మెహ్ర తయారైంది. ఏఐ అమ్మ అంటూ పరిచయం చేసిన కొద్దిగంటల్లోనే పాపులర్ అయ్యింది.
కావ్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో 300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. మాతృత్వానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటోంది. వంట వండటం, పెయింటింగ్స్ వేయడం, అందంగా మెరిసిపోవడం లాంటి ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్లతో చర్చిస్తోంది. బయటి ప్రపంచంలో నిజమైన తల్లి తన పిల్లల పట్ల ఎలాంటి ప్రేమను వ్యక్తం చేస్తుందో.. అలాంటి ప్రేమను ప్రదర్శిస్తోంది. తాను ఎలా గర్భం దాల్చింది? పిల్లల పెంపకం ఎలా ఉందో వివరిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏఐ అమ్మను ఫాలోవ్వండి మరి. ఏం చెబుతుందో తెలుసుకుందాం.