calender_icon.png 16 March, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్ ఏఐదే!

16-03-2025 12:00:00 AM

మండల విద్యాధికారులు పురందాస్, సయ్యద్ అక్బర్

తంగడపల్లి, టంగటూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలు ప్రారంభం 

చేవెళ్ల , మార్చి 15 : విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి ‘ఏఐ’ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చేవెళ్ల, శంకర్పల్లి మండలాల విద్యాధికారులు పురందాస్, సయ్యద్ అక్బర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఏఐ కార్యక్రమాలు పైలట్ ప్రాజెక్ట్ కింద చేవెళ్ల మండల పరిధి తంగడిపల్లి, శంకర్పల్లి మండల పరిధి టంగటూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. శనివారం రెండు పాఠశాలల్లో కృత్రిమ మేథో సంపత్తి కార్యక్రమాలను ఎంఈవోలు ముఖ్య అతిథులగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మన పాఠశాలలు ఎంపిక కావడం హర్షణీయమని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జీవన జ్యోతి, టంగటూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుసాల్ విల్సన్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆరిఫ్, తండగపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్, పీఆర్టీయూ చేవెళ్ల మండల అధ్యక్షుడు దయానందం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, టంగటూరు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునంద, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.