calender_icon.png 31 January, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ విశ్వరూపం!

31-01-2025 12:55:08 AM

అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు

  1. రెండేళ్లలో ఏఐ ద్వారా కోటిమందికి సేవలు 
  2. 20% ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యం

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న సంక ల్పంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ సాంకేతికతపై ఫోకస్ పెట్టింది. పౌరులు సేవలు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన, వ్యవస్థల నిర్వహణలో పారదర్శకత కోసం ఏఐ ఆధారిత సాంకేతికతను వినియో గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

డేటా నాణ్యతకు కూడా ఏఐని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభు త్వం.. తాజాగా పాఠశాల విద్యతో పాటు టీచర్ ట్రైనింగ్‌లోనూ దీనిని వినియోగించుకోవాలని నిర్ణయించింది.

త్వరలో అన్ని శాఖలకు విస్తరించే ఆలోచనలో ఉన్నది. ఇప్పటికే దేశంలోని కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రభుత్వ విభాగాల్లో ఏఐని భాగం చేసిన నేపథ్యంలో, తెలంగాణలోనూ పెద్దఎత్తున సాంకేతికతను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

గ్రామీణపాలనలో ఏఐ టెక్నాలజీ

ఏఐ అధారిత టెక్నాలజీ గ్రామీణ పాలనలో పెద్దఎత్తున ప్రవేశపెట్టేందుకు, తొలివిడతలో 1300 గ్రామాలను డిజటలీకరణ చేయా లని భావిస్తోంది. ఈ క్రమంలో గ్రామస్థాయిలో వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులను ప్రాథమికస్థాయిలో ప్రాసెస్ చేసేందుకు ఏఐ సేవలను వినియోగించుకునే ఆలోచనపై ప్రభుత్వం దృష్టి సారించిం ది. దీనిద్వారా సకాలంలో సేవలను అందించవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. 

సంక్షేమ పథకాల అమలులో..

సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏఐని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా లబ్ధిదారుల ఎంపిక వేగంతో పాటు కచ్చితత్వం కూడా ఉంటుందని సర్కారు భావిస్తోంది. అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రతిపౌరుడి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డేటాను ఏఐ సాయంతో స్టోర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా రాష్ట్రం లో ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ అనేది తెలుసుకోవడం సులభం అవుతుందని, తద్వారా చికిత్స మరింత ఈజీ అవుతుందని ప్రభత్వం భావిస్తోంది.

ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఇది సాయపడుతుంది. ఇదిలా ఉండగా.. త్వరలో పెన్షన్ లబ్ధిదారులను కూడా ఈ టెక్నాలజీ సాయంతో ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, ఇంటర్, పాఠశాల విద్యతో పాటు వ్యవసాయ రంగంలో కూడా ఏఐని విరివిగా వినియోగించే ప్రణాళికను రచించినట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. 

ట్రాఫిక్ నిర్వహణ.. నకిలీలకు చెక్

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పట్టణాల్లో ట్రాఫిక్‌ను నిర్వహణ కోసం ఏఐను వినియోగిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు దీనికి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌తోపాటు పార్కింగ్‌లో కూడా ఏఐని విరివిగా వినియోంచుకో వాలని ప్రభుత్వం చూస్తోంది.

ఇదే సమయంలో పన్నుల వసూళ్లలో లీకేజీలను  అరికట్టేందుకు కూడా సాంకేతిక సాయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దీని కోసం ఇటీవల ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. అలేరియా ఏఐ కంపెనీతో చర్చలు జరిపారు.

2027 నాటికి కోటి మందికి.. 

2027 నాటికి ఏఐ ద్వారా రాష్ట్రంలో కోటి మందికి పౌర సేవలను అందించాలన్న లక్ష్యంతో ప్రభు త్వం పనిచేస్తోంది. ఈమేరకు ప్రభు త్వం రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధంచేసింది. అన్ని శాఖలు, వ్యవస్థల్లో ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా 2027 నాటికి సర్కారు ఉద్యోగుల ఉత్పాదకతను 20 శాతం పెంచే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. భాషతో పాటు సంస్కృతిని పరిరక్షించేందుకు ఏఐని వినియోగించాలని చూస్తోంది.

ఏఐ రింగ్‌లోకి భారత్

భువనేశ్వర్:  రాబోయే కొద్ది నెల ల్లో  భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను  అభివృద్ధి చేసుకోబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏఐ మోడల్ పూర్తిగా భారత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్ద నున్నట్లు ఆయన తెలిపారు. మన దేశ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో ఈ ఏఐ మోడల్‌ను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు డెవ లపర్లను గుర్తించామని చెప్పారు.