calender_icon.png 17 January, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎస్సీ పరీక్షల్లో ఏఐ

26-07-2024 03:44:44 AM

  1. ప్రస్తుతం ఉన్న విధానాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం 
  2. కొత్త టెక్నాలజీతో కేటుగాళ్లకు చెక్

న్యూఢిల్లీ, జూలై 25: యూపీఎస్సీ పరీక్షల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో చాలా చోట్ల తప్పులు జరగడంతో ఈ నిర్ణ యం తీసుకున్నారు. మాస్ కాపీయింగ్, చీటింగ్, అక్రమాలకు నూతన టెక్నాలజీతో చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేయాలని యూపీఎస్సీ భావి స్తోంది. యూపీఎస్సీ దేశ వ్యాప్తంగా ఏటా 14 రకాల పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. వీటిల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సివిల్ సర్వీసెస్ పరీ క్ష కూడా ఉంది. కానీ గత కొద్ది రోజులుగా యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో కొంత మం ది కాపీ కొడుతూ, మరిన్ని అక్రమాలు చేస్తున్నారు. దీంతో మరింత కఠినంగా పరీక్షలను నిర్వహించాలని యూపీఎస్సీ నిర్ణయించింది. 

సీసీటీవీలు కూడా.. 

పరీక్షా కేంద్రాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా (ఏఐ) సీటీవీలతో మానిటర్ చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. అంతే కాకుండా ఈ కార్డులను జారీ చేసి వాటిని క్యూఆర్ ద్వారా స్కాన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ టెక్నాలజీకి సంబంధి ంచి పలు సంస్థల నుంచి కమిషన్ బిడ్లను కూడా ఆహ్వానిస్తోంది. ఇటీవల నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అంతే కాకుండా ట్రైయి నీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సమర్పించిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ యూపీఎస్సీకి కొత్త చిక్కులు తీసుకొచ్చాయి. అందుకే సాంకేతికతను ఉపయోగించి వీడికి అడ్డుకట్ట వేయాలని కమిషన్ భావిస్తోంది.