calender_icon.png 30 January, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లలో ఏఐ

30-01-2025 02:00:16 AM

  1. నిర్మాణం, చెల్లింపుల్లో అవకతవకలు వద్దు
  2. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు
  3. తొలి విడతలో 72వేల మందికి ఇంటి పత్రాలు ఇచ్చినట్టు వెల్లడి

హైదరాబాద్, జనవరి 29 ( విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు మేలు చేకూరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్  శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్లపై సచివాలయంలో బుధవా రం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి  మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక నుండి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకూ కృత్రిమ మేధస్సు(ఏఐ)ని వాడుకోవాలన్నా రు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్‌ను రూపొందించి సర్వే నిర్వహించినట్టు మంత్రి గుర్తు చేశారు.

ఇండ్ల నిర్మాణం, చెల్లింపుల్లో  అవకతవకలకు ఆస్కారం లేకుండా ఏఐని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలను  క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో సరిపోలుస్తూ అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఇండ్ల నిర్మా ణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

ఈ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి ఆస్కా రం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా టెక్నాలజీని వాడుకోవాలని అధికారులకు సూచిం చారు. అలాగే ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేం దుకూ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. జనవరి 26న మొదటి విడుతలో నివాస స్థ్ధలం కలిగిన 72 వేల మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు.

తొలి విడుత ఇండ్ల మంజూ రులో అత్యంత నిరుపేదలు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్  ఎండీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.