ఐఐహెచ్‌ఎం చైర్మన్ డాక్టర్ సుబోర్న్ బోస్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఆహార వ్యర్థాలను తగ్గించడానికి ఏఐ దోహదపడుతుందని ఇంటర్నేషనల్ ఇ న్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐఐహెచ్‌ఎం) చైర్మన్ డాక్టర్ సుబోర్న్ బోస్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఐఐహెచ్‌ఎం ఆధ్వర్యంలో యంగ్ చెఫ్ ఒలింపియాడ్ 11వ ఎడిషన్ జరిగింది.
దీనికి ము ఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. పాక శాస్త్రం దిశను ఏఐ మారుస్తుందన్నారు. మెనూ ప్లానింగ్, ఫుడ్ ప్రజంటేషన్, స్మార్ట్ కిచెన్ ఉపకరణాలు వంటి వాటిలో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఈ పోటీలకు 15 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.