హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో ‘ఏఐ హాక్ డే-2025’ కార్యక్రమాన్ని బుధవా నిర్వహించారు. డీన్ ఎస్‌వోఈ డాక్టర్ వీ విజయ్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని డీన్ సీఎస్ఈ డాక్టర్ జీ విష్ణుమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ హెచ్‌వోడీ డాక్టర్ ఏ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడు వివిధ హ్యాకథాన్లలో పాల్గొనేందుకు విద్యార్థులు ఎలా ఎదురు చూస్తున్నారో, ఈ పోటీలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు.
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరిగే ఏఐ హాక్ డేస్ 2025లో మరో దశలో ఈ రౌండ్ నుంచి ఉత్తమ జట్లకు చోటు లభిస్తుందని చెప్పారు. ఐఐఐటీ హైదరాబాద్, ఓజోన్‌టెల్, టెక్వేదిక, డీక్యూలో ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు పొందే అవకాశాన్ని ఈ ఈవెంట్ కల్పిస్తుందన్నారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 52 బృందాల్లో 156 మం పాల్గొని వారు రూపొందించిన విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, క్రియేటివ్టెక్ డొమైన్లలో ఏఐ ఆధారిత ప్రాజెక్టులను సమర్పించారు.