04-09-2024 01:20:10 AM
ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): ఈనెల 5, 6 తేదీల్లో హైదరా బాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమ్మిట్‌కు హాజరై ప్రారంభించనున్నారు. ప్రపంచంలోని అగ్రగా మి నిపుణులందరూ ఒకేచోట చేరి ఏఐ ఫర్ సోషల్ చేంజ్, సేఫ్ ఏఐ, పుషింగ్ బౌండరీస్ ఆఫ్ ఇన్నోవేషన్, పారడిజిమ్ షిఫ్ట్ ఇన్ ఇండస్ట్రీస్ తదితర అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
దీనికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యోట్టా, ఎన్‌విదియా వంటి టెక్నాలజీ కంపెనీలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్‌పై దేశ, విదేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సద స్సులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలను ఎంపిక చేసి, వాటిపై విస్తృత అనుభవం ఉన్న నిపుణులతో సెషన్‌ల వారీగా కీలక ప్రసంగాలు చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించారు.