calender_icon.png 17 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఏఐ గ్లోబల్ సదస్సు

14-07-2024 12:06:26 AM

  1. రెండువేల మంది నిపుణుల హాజరు
  2. సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
  3. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
  4. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  5. లోగో ఆవిష్కరణ

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  గ్లోబల్ ఏఐ సదస్సును సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరా బాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న ట్టు ప్రకటించారు. శనివారం జెఎన్టీయూలో గ్లోబల్ ఏఐ సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీ ఎం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించటం గర్వంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలందరినీ ఈ సందర్భంగా హైదరాబాద్‌కు  ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దాదాపు ౨ వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. 

ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు సదస్సు: శ్రీధర్‌బాబు 

ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచ సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగ పడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ సదస్సు ఏఐ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలుకనుందని చెప్పా రు. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.