- వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాలల్లో ఏఐ కరికులం
- విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా చర్యలు
- 2027 కల్లా 100 శాతం ఏఐ బోధనా పరికరాలు
హైదరాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): ప్రస్తుత ప్రపంచమంతా ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ దిశగా నడుస్తోంది. అన్నిరంగాల్లో ఏఐ ప్రభావం రోజురోజుకూ గణనీ యంగా పెరుగుతున్నది. భవిష్యత్ అంతా ఏఐ ఆధారంగానే నడుస్తుంది. ఈ నేపథ్యం లో ప్రస్తుత ఏఐ ప్రపంచంతో పోటీ పడి విధ ంగా యువతను తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుంది.
అందులో భాగంగా విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి ఏఐపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొ ందిస్తుంది. పాఠశాల నుంచి విద్యార్థులకు ఏఐపై నైపుణ్యం పెంపొందించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులకు ఏఐ పాఠ్యాంశాలు బోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. భవిష్యత్‌లో ఏఐ ఆధారిత ఉద్యోగాలు అందిపుచ్చు కునేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నది.
5 లక్షల మంది విద్యార్థులకు..
ఏఐ ఆధారిత పాఠ్యాంశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నా రు. దీంతోపాటు ఏఐ లెర్నింగ్ కిట్లు, ఏఐ కరికులం, శిక్షణ పొందిన టీచర్లను అందుబా టులో ఉంచనున్నారు. 2027 విద్యా సంవత్సరం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పాఠశా లల్లో 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐపై బోధనను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దీని కోసం 20 వేల మంది ఎడ్యూకేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల స్థితిగతుల దృష్ట్యా ఏఐ పాఠ్యాంశాలను తెలుగు, ఇంగ్లీష్ భాష ల్లో అందించాలని నిర్ణయించారు. ఏఐ ద్వారా లభించే ఉద్యోగావ కాశాలపై కెరీర్ కౌన్సిలింగ్‌ను కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఏఐ బోధనా పరికరాలను సమకూర్చే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ప్రయోగాత్మక బోధన..
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ప్రయోగాత్మక పద్ధతిలో బోధించాలని నిర్ణయించారు. దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సవాళ్లను అధిగమించేలా విద్యార్థులకు పాఠశాల దశ నుంచే శిక్షణ ఇచ్చేందుకు ఈ పద్ధతి ఎంతోగానో ఉపయోగపడుతుంది.
హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు సంబంధించిన ప్రయోగాలు చేసేందుకు కావాల్సిన ఏఐ ల్యాబ్‌లను, పరికరాలను సమకూర్చనున్నారు. ప్రయోగాత్మక బోధనలో భాగంగా ఐవోటీ డివైజెస్, క్లౌడ్ యాక్సెస్, ఏఐ టూల్స్ అండ్ లైసెన్స్‌లను వినియోగించుకుని శిక్షణ పొందిన టీచర్ల ద్వారా బోధించనున్నారు. పాఠశాల లో ప్రవేశపెట్టే కరికులం ద్వారా ఆర్థిక, పరిశ్రమల పోకడలను వివరించేందుకు అవకాశం లభిస్తుంది.
ఏఐ ఉద్యోగాలపై అవగాహన..
ఏఐ ద్వారా లభిం చే ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. ఏఐ ఉద్యోగాలు అందిపుచ్చుకునే లా విద్యార్థులను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు పాఠశాల దశలోనే విద్యార్థులకు ఏఐపై బోధించడం ద్వారా యూజీ, పీజీ వంటి ఉన్నత విద్యలో ఎంచుకోవాల్సిన కోర్సులపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
ఏఐ కరికులంలో ఉం డే ఎథికల్ ఏఐ, ఏఐ ఆల్గారిథమ్స్, ఆన్‌లైన్ సేఫ్టీ, ఏఐ మ్యానుప్లేషన్ వంటి అంశాలపై ప్రధానంగా అవగాహన కల్పించనున్నారు. ఏఐ ద్వారా సమాజంపై పడే పరిణామాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు అవకాశం లభిస్తుంది.