08-04-2025 12:00:00 AM
జగదేవపూర్, ఏప్రిల్ 7: జగదేవపూర్ మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో నూతన ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడోస్ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు పోటీ పడగలరన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.
జగదేవపూర్ మండలంలోనే మొట్ట మొదటిగా మాస్టర్ మైండ్ పాఠశాలలో మాత్రమే ఏఐ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే మాస్టర్ మైండ్ పాఠశాలలో చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, నాయకులు కొంపల్లి మహేష్, కుమ్మరి కనకయ్య, ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.