calender_icon.png 3 April, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కోర్సుల్లో ఏఐ విద్య!

02-04-2025 12:00:00 AM

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం

ఉన్నత విద్యామండలి కసరత్తు

సిలబస్ రూపొందించే పనిలో విద్యావేత్తలు

బీఏ, బీకాం కోర్సుల్లో ఏఐ విద్య 

మెదక్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ప్రాథమిక విద్య స్థాయి నుంచే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రానున్న విద్యా సంవత్సరానికి ప్రాథమిక విద్యాస్థాయిలో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తరగతులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇదే తరహాలో డిగ్రీ విద్యా విధానంలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు  చేస్తుంది. ఏఐ విద్యను బీఏ, బీకాం కోర్సుల్లోనూ ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా ఏఐలో మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి కోర్సులను చదివేవిధంగా నిబంధ నలను సవరించాలని నిర్ణయించింది.

బీఏ, బీకాంలో ఉండే సబ్జెక్టులకు తోడు మొదటి సంవత్సరంలో ఏఐ, రెండో సంవత్సరంలో మెషిన్ లర్నింగ్, మూడో సంవత్సరంలో సైబర్ సెక్యూరిటీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాలు విభాగాల సబ్జెక్టల నిపుణులతో కీలక సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యామండలి కృత్రిమ మేథ, అడ్వాన్స్ కోర్సులను అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

ఉపాధి అవకాశాల కోసం

సైన్స్ సబ్జెక్టులు కాకుండా ఆరట్స్ విభాగంలో బీఏ, బీకాం కోర్సులు చేసిన విద్యార్థులు టెక్నికల్ కోర్సులు చేయకపోవడం, ఇతర ఉపాధి, ఉద్యోగాల్లో అవకాశాలు లభించక పోవడంతో డిగ్రీ చదివి నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో జీవితంలో నిలదొక్కుకోవాలంటే రానున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలని సంకల్పించారు.

ఇందుకు సంబంధించిన ఏఐ సిలబ స్ను రూపొందించేందుకు ఆయా రంగాల్లో పనిచేస్తున్న విద్యావేత్తలు సిలబస్ రూపొందించనున్నారు. డిగ్రీలో అడ్మిషన్లు మొదలైన వెంటనే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, కోర్సు మెటీరియల్ను ఉన్నత విద్యామండలి వ్బుసైట్లో అందుబాటులో ఉంచనున్నారు. 

వెనుకబడిన మెదక్ జిల్లాకు మేలు

పోటీ ప్రపంచంతో మనం కూడా పోటీ పడాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు అవస రం ఏర్పడుతుంది. మెదక్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మూడు కొనసాగుతున్నాయి. అందులో ఒకటి మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఉంది.

మెదక్లో రెండు, నర్సాపూర్లో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో సుమారు ఏడు వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఏఐకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే విద్యార్థులకు ఉపయుక్తంగా మారనుంది.