calender_icon.png 6 March, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అహల్యాబాయి 300వ జయంతి

06-03-2025 12:00:00 AM

కామారెడ్డి, మార్చ్ 5 (విజయక్రాంతి): అహల్యా బాయి హోల్కర్ మాల్వా సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప మహారాణి అని ‘హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం‘ తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బాసెట్టి లత’  అన్నారు. బుధవారం కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ & సైన్స్ కళాశాల లో ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్ అధ్యక్షతన  కళాశాలలో ది ఫిలాసఫియర్ క్వీన్’ అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ అహల్యబాయి మహిళా శక్తికి నిజమైన నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా డా. బాసెట్టి లత  మాట్లాడుతూ కఠినమైన  స్త్రీ ఆచారాలు ఉన్న పరిస్థితుల్లో స్త్రీ జనోద్ధరణకు పూనుకుందని, స్త్రీ అభ్యున్నతికి పాటిపడిందని తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల హింది విభాగ అధిపతి డా. జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ అహల్యా బాయి హోల్కర్, సేవ నిరుతిని,గొప్పతనాన్ని  కొనియాడారు.

తెలుగు విభాగం అధ్యక్షులు డా. పి. విశ్వ ప్రసాదు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు అహల్యా బాయి హోల్కర్ ను ఆదర్శంగా తీసుకొని జీవితంలో పైకి రావాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో తెలుగు అధ్యాపకులు కె. రవి కుమార్, జి. మల్లేశం, హిందీ విభాగపు అధ్యాపకులు బాలాజి ఇతర విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అహల్యా బాయి హోల్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు .