calender_icon.png 4 January, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ రంగం అగ్రస్థానంలో నిలపాలి

03-11-2024 02:11:14 AM

  1. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  2. కొత్త వ్యవసాయ శాఖ అధికారుకు శిక్షణ  

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాం తి): రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయరంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందని,  రానున్న ఐదేళ్లలో వ్యవసాయరంగాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు వ్యవసాయాధికారులు  భాగస్వాములు కావాలని  వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

శనివా రం ఎంసీహెచ్‌ఆర్‌డీలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారుల శిక్షణ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  రైతుల అనుభవాలు మనందరికీ పాఠాలన్నీ, తరగతి గదుల్లో నేర్చుకొ న్న సాంకేతిక విజ్ఞానాన్ని దానికి జోడించినట్లయితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

రైతులను సాంప్రదాయ పంటల సాగు నుంచి వాణిజ్య పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. పంటల మార్పిడి అవశ్యకతను వివరిస్తూ, జీవవైవిధ్యం కాపాడుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు.

వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు..

భవిష్యత్తులో వ్యవసాయరంగానికి ఉజ్వ ల భవిష్యత్తు ఉందని, అటువంటి రంగంలో మీరంతా ఉన్నందుకు గర్వపడాలని మంత్రి అన్నారు. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి, సంవత్సరాల తరబడి మీరు చేసిన సేవలు గుర్తుంచుకొనే విధంగా కృషి చేయాలని కొత్త వ్యవసాయాధికారులను కోరారు.

ఎప్పటికప్పుడు అధికారులందరూ, సాంకేతికంగా వస్తున్న మార్పులను, పద్ధతులను తెలుసుకొంటూ, రైతులకు చేరవేయా లని సూచించారు. వాతావారణ పరిస్థితులలో వస్తున్న మార్పులను గ్రహిస్తూ, రైతులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయశాఖ డైరెక్టర్  గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, డైరెక్టర్ జనరల్ శశాంక గోయల్ పాల్గొన్నారు.