దౌల్తాబాద్, (విజయక్రాంతి): వరి కొయ్యలను కాల్చవద్దని, కాలిస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు మల్లేశం పల్లి, లింగరాజుపల్లి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు వరి కొయ్యలను కాల్చడంపై జరిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొయ్యలు కాల్చడం వల్ల వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని, కాలుస్తే సూక్ష్మజీవులు నశించిపోతాయన్నారు. కొయ్యలను కాల్చకుండా దుక్కి దున్నాలన్నారు. అనంతరం ఆయిల్ ఫామ్ పంట సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సంతోష్, బాపురాజ్, శిరీష, సీసీలు, సీఎలు పాల్గొన్నారు....