calender_icon.png 9 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

07-03-2025 12:00:00 AM

కామారెడ్డి, మార్చి 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని దోమకొండ , ముత్యంపేట్ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను గురువారం జిల్లా వ్యవసాయ సంచాలకులు అపర్ణ తనిఖీ చేశారు. సహకార సంఘాలతో పాటు ప్రైవేటు ఫర్టీలైజర్ దుకాణాలలో ఉన్న ఎరువులను తనిఖీ చేశారు.

కల్తీ ఎరువులు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మణిదీపిక, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.