మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా పెద్ద విజయ్ కుమార్, డైరెక్టర్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా చేస్తామని తెలిపారు. ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటామని, వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు శాయశక్తులుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రదాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, సిజె బెనహర్ తదితరులు పాల్గొన్నారు.