calender_icon.png 1 April, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందులకు నిలయాలుగా వ్యవసాయ గిడ్డంగులు...

29-03-2025 11:57:47 PM

 - కోట్లు ప్రజాధనం వృధా.. 

- మంత్రి ఇలాఖాలో దుస్థితి..    

పట్టించుకోని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి భద్రపరిచేందుకు నూతనంగా నిర్మించిన గిడ్డంగులు ప్రస్తుతం పందుల ఆవాసాలకు నిలయాలుగా మారాయి. కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలోని వ్యవసాయ గిడ్డంగి ప్రాంతం పందులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు కొంతమంది వ్యక్తులు అక్కడే పందులకు ఆహారాన్ని పడేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం పూర్తిగా పందుల ఆవాసాలుగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కష్టపడి పండించిన పంట అమ్ముకునే క్రమంలో సరైన గిట్టుబాటు ధర రాక ఇంటి వద్ద ధాన్యాన్ని భద్రపరుచుకోలేక దళారుల చేతికి చిక్కి రైతులు తీవ్రంగా నష్టపోతున్న సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గిట్టుబాటు ధర పొందే దాకా ధాన్యాన్ని గిడ్డంగుల్లో భద్రపరచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా దళారులకు కొమ్ముకాసే విధంగా అధికార దుర్వినియోగం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. ఇతర ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు దిక్సూచిగా ఉండాల్సిన మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కోట్ల విలువచేసే గిడ్డంగుల ప్రదేశంలోనూ పందులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో వ్యవసాయ గోదాం పరిసరాల్లో పూర్తిగా పందుల ఆవాస కేంద్రాలుగా మారాయి.