మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని నార్లపూర్ గ్రామంలోని వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ అధికారులు సోమవారం పరిశీలించారు. వరి పంట పిలక దశ నుండి పొట్ట దశలో ఉందని, వరి పంటలో సుడి దోమ, బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు యూరియా వాడకాన్ని తగ్గించాలని, అలాగే కాపర్ హైడ్రాక్సిడ్ 400 గ్రా+ ప్లాంటామైసీన్ 100 గ్రా ఒక ఎకరాకు 200 లీ నీటిలో కలిపి పిచికారి చేయాలని, సుడి దోమ నివారణకు పొలం మడిలోని నీటిని తొలగించి ఆరబెట్టి డైనోటుఫురాను 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు గ్రామ రైతులు అరికటి రవీందర్, సాయి, రాజన్నలు ఉన్నారు.