01-03-2025 07:36:05 PM
మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని వ్యవసాయ పొలాలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజులు పరిశీలించారు. శనివారం మండలంలోని అందుగులపేట గ్రామ వరి పొలాలను పరిశీలంచారు. వరిలో ముఖ్యంగా జింకు లోపంతో పాటు మొగి పురుగు,సల్ఫర్ హాని ఉన్నట్లు గుర్తించారు. జింక్ లోప నివారణకు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలన్నారు. అలాగే మొగి పురుగు నివారణకు క్లోరాంతనిలిప్రోల్ 60 మీ.లీ ఒక ఎకరానికి పై పాటుగా పిచికారీ చేసుకోవాలని,అదే విదంగా సల్ఫర్ ఇంజురీ నుంచి కాపాడుకోవడానికి పొలాన్ని చీమ నెర్రె వచ్చేలా ఆరబెట్టి నీళ్లు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు హనుమంత రెడ్డి, దుర్గం శ్రీను, మల్లేష్ లు పాల్గొన్నారు.