17-03-2025 08:02:00 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం కేంద్రంలో రైతులు సాగుచేసిన పంటలను మండల వ్యవసాయ అధికారి నరేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవికాలం అనే దృష్టిలో పెట్టుకొని బోరుబావుల వద్ద ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. రోజురోజుకు బోరు బావుల్లో నీటిమట్టం తగ్గుతుందని పేర్కొన్నారు. రైతులు సాగుచేసిన వరి పంటను పరిశీలించి వారికి పలు సలహాలు సూచనలు అందజేశారు.