భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ఏజెన్సీకి ముఖ్య కూడలి అయిన భద్రాచలం కేంద్రంలో ఆధునిక యంత్రాంగంతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు కోరారు. గురువారం హైదరాబాదులోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
భద్రాచలంలో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చేదాకా నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని అన్నారు. దీనితో రైతులకు మధ్యవర్తుల నుండి విముక్తి పొందుతారని మంత్రికి తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే ఆదేశించి భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ బుడగం శ్రీను తోటకూర రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు