calender_icon.png 3 April, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ

30-03-2025 12:41:25 AM

కరీంనగర్, మార్చి 29 (విజయక్రాంతి): కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ పురుషోత్తం, సెక్యూరిటీ గార్డు కరివేద శ్రీనివాస్‌రెడ్డి శనివారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కమీషన్ ఏజెంట్ లైసెన్స్ రెన్యూవల్ కోసం పురుషోత్తం రూ.60 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు.

ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు వారి సూచ నమేరకు శనివారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యా లయంలో లంచం ఇస్తుండగా పురుషోత్తంతోపాటు సెక్యూరిటీగార్డు శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.