calender_icon.png 24 September, 2024 | 3:25 PM

పెద్దపల్లి ఎమ్మెల్యేను కలిసిన వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం

24-09-2024 02:03:58 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): ఇటీవల నూతనంగా నియమితులైన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, నూతన డైరెక్టర్లు మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తమపై నమ్మకంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గంలోకి నియమించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన చైర్మన్ ఈర్ల స్వరూపను, వైస్ చైర్మన్ కూర మల్లా రెడ్డితో పాటు పాలకవర్గానికి తమ నియామక పత్రాలను  అందజేశారు.

శాలువాలతో సత్కరించి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రైతు సంక్షేమానికి కృషి చేయాలని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు ఆల్ల సుమన్ రెడ్డి (పోత్కపల్లి ప్యాక్స్ చైర్మన్), కొమ్ము కరుణాకర్, సోమ చంద్రయ్య, మడగోని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోలపు పెద్ద రాజేశం, పిట్టల కొమురయ్య, ఎం.డి గౌస్ మియ, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పరపు ప్రభాకర్, సరోత్తం రెడ్డి, ఎడ్ల మహేందర్, ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.