calender_icon.png 20 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు

24-03-2025 11:09:03 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను అందించనున్నట్లు బెల్లంపల్లి ఏడిఏ రాజ నరేందర్ తెలిపారు. బ్యాటరీ స్ప్రే మార్ప్-14, స్ప్రేయర్స్ 10, రోటవేటర్-04, విత్తన మిషన్లు 2, కల్టివేటర్ 07, బ్రష్ కట్టర్ 01, పవర్ విడర్ 1, ట్రాక్టర్ 01, అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈనెల 26 వరకు దరఖాస్తులు పూర్తిచేసి మండల వ్యవసాయ అధికారులను గాని, వ్యవసాయ విస్తరణ అధికారులను గాని సంప్రదించాలని కోరారు.