28-03-2025 12:00:00 AM
నాగారం , మార్చి 27: వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (ఎస్‌ఎంఏఎం) కింద రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు అర్హులైన మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి కష్ణకాంత్ తెలిపారు.
గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 202425 ఆర్థిక సంవత్సరంలో 40 నుంచి 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించేందుకు అర్హులైన మహిళా రైతులు ఈనెల 29వ తేదీ లోగా దరఖాస్తులు చేొసుకోవాలన్నారు.
నాగారం మండలానికి బ్యాటరీ స్ప్రేయర్స్6, పవర్ స్ప్రేయర్స్ 5, రోటావేటర్స్ 2, (డిస్క్ హార్రోస్, కల్టివేటర్స్, ఎంబీప్లవ్, కేజ్ వీల్స్)3, బండ్ ఫార్మర్1 తదితర పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసక్తి గల అర్హులైన రైతులు దరఖాస్తుతో పాటు ఫొటో, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, జిరాక్స్ పత్రాలు జత చేసి రైతు వేదిక లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని కోరారు.