27-03-2025 09:01:22 PM
కొల్చారం (విజయక్రాంతి): మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను ఇవ్వడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి తెలిపారు. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జనరల్, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీపై వ్యవసాయ, ట్రాక్టర్ పనిముట్లు రాయితీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. కోల్చారం మండలానికి హ్యాండ్ ఆపరేటర్ స్ప్రేయర్-3 అందులో జనరల్-2, ఎస్సీ-1, పవర్ స్ప్రేయర్-4, జనరల్-3, ఎస్సీ/ఏస్టి-1, డిస్క్ హ్యారో-2 జనరల్-1, ఎస్సీ-1, రోటవేటర్-1 జనరల్-1, స్ట్ర బలర్ - 1, జనరల్ -1 కేటాయించడం జరిగింది.
కావున ఆసక్తి ఉన్నటువంటి మహిళ రైతులు వారి పేరు మీద ఉన్నటువంటి ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్, భూమి పట్టా పాస్ బుక్ వివరాలు, ఒరిజినల్ డిడి తో పాటుగా దరఖాస్తు ఫారాన్ని ఈ నెల 29వ తేదీ లోపు కొల్చారం మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు సంప్రదించవలసినదిగా వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.