calender_icon.png 3 April, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా రైతు గ్రూపుకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్

26-03-2025 01:38:47 AM

మునగాల మార్చి 25;- సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి వ్యవసాయంలో ఉప యోగించే ఒక  డ్రోన్ పరికరాన్ని 5 లక్షల సబ్సిడీ తో మహిళా గ్రూప్ రైతులకు అందించడానికి అనుమతి వచ్చింది.  ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మహిళా రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి, బ్యాంకు నుండి లోన్ తీసుకోవడం ద్వారా 5 లక్షల సబ్సిడీతో డ్రోన్ పరికరాన్ని పొందవచ్చు. 

ఈ మహిళా గ్రూపులో కచ్చితంగా డిగ్రీ పూర్తి అయిన ఒక మహిళ ఉండి ఉండాలి.కావున కావాల్సిన మహిళా రైతులు మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం మునగాలలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మహిళా రైతులకు ట్రాక్టర్ తో నడిచే పొలంలో బోదేలు,  గట్లు చేసే యంత్రం 1,20,000 సబ్సిడీ తో కలదు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ట్రాక్టర్స్ పనిముట్లకి ఒక దరఖాస్తు పవర్స్ ప్రేయర్స్ లకు ఆరు దరఖాస్తులను మండలంలో స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకులు డి.ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్య, భవాని, రేష్మ, నాగు పాల్గొన్నారు.