రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి (నల్లగొండ), డిసెంబర్ 22 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందని రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఆదివారం జరిగిన జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల బతుకులు బాగు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసి జిల్లా రైతుల రుణం తీర్చుకుంటామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ను పూర్తిచేసి ఫ్లోరైడ్ రక్కసిని పారదో లుతామన్నారు అంత కుముందు వివిధ రాష్ట్రాల్లో సేంద్రియ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 115 ఉత్తమ రైతు జంటలకు పుడమీ పుత్ర అవార్డులను మంత్రి అందజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న 35 మంది అధికారులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు.. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.