calender_icon.png 21 September, 2024 | 1:52 AM

కీలకరంగాల్లో సింగపూర్‌తో ఒప్పందం

06-09-2024 12:10:22 AM

  1. భారత్ స్నేహం బలమైనది 
  2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సింగపూర్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమో దీకి ఆ దేశ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో ఘన స్వాగతం పలికింది. ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అయిన మోదీ.. గురువారం పార్లమెంట్ హౌస్‌లో ప్రసంగించారు. ‘భారత్ దేశాల స్నేహాన్ని బలోపేతమే లక్ష్యంగా నేను ఈ పర్యటన చేస్తున్నాను. భారత దేశంలో ఎన్డీఏ సర్కార్ చేపడుతున్న సంస్కరణలు, దేశ యువశక్తి ప్రతిభ మన దేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయి.

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఇక్కడి దౌత్య వేత్తలకు పిలుపుని స్తున్నాను’ అని మోదీ తెలిపారు. అభివృద్ధి, విదేశీ వ్యవహారాల విషయంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. తదనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ఇరువురు దేశ ప్రధానులు సంతకాలు చేశారు. అందులో.. 1. డిజిటల్ టెక్నాలజీ, 2. హెల్త్‌కేర్, 3. విద్య, నైపుణ్యాల అభివృద్ధి, 4. సెమీకండక్టర్ సహకారం వంటి రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. అక్కడి పార్లమెంట్‌లో ప్రవేశించే ముందు మోదీ విజిటర్స్ బుక్‌లో సంతకం కూడా చేశారు. మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు ప్రధానుల మధ్య తొలిసారి చర్యలు జరగడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.